- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ మహిళలకు శుభవార్త.. ఆ కంపెనీతో సర్కార్ కీలక ఒప్పందం
రాష్ట్రంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధే లక్ష్యంగా గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఆర్థిక సేవల విభాగం గోద్రేజ్ క్యాపిటల్, తెలంగాణ ప్రభుత్వంతో బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధే లక్ష్యంగా గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఆర్థిక సేవల విభాగం గోద్రేజ్ క్యాపిటల్, తెలంగాణ ప్రభుత్వంతో బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం రాష్ట్రంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధిని వేగవంతం చేయడానికి క్రెడిట్ యాక్సెస్ పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భాగస్వామ్యం ప్రత్యేకించి అట్టడుగు వర్గాలు, మొదటిసారి రుణాలు తీసుకునే వారి క్రెడిట్ యాక్సెస్‌ను మెరుగుపరుస్తుంది. గోద్రేజ్ క్యాపిటల్ ఆరోహి ప్రత్యేక కార్యక్రమం ద్వారా మహిళా వ్యవస్థాపకులకు ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ భాగస్వామ్యం ద్వారా స్థానిక ఎంఎస్ఎంఈలకు, ముఖ్యంగా మహిళా వ్యవస్థాపకులకు ఆవిష్కరణాత్మక, డిజిటల్ రుణ పరిష్కారాలు, కస్టమ్ చేయగల ఆర్థిక ఉత్పత్తులను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
గోద్రేజ్ క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ మనీష్ షా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూపై హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి మహిళలు నేతృత్వం వహించే సంస్థలను ప్రోత్సహించడమే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. తెలంగాణ మాకు ప్రాధాన్యత ఇచ్చే మార్కెట్లలో ఒకటని, సాంకేతికతతో కూడిన రుణ పరిష్కారాలు, త్వరిత అనుమతుల ద్వారా తెలంగాణలోని ఎంఎస్ఎంఈ లకు అవకాశాలు కల్పిస్తామన్నారు. ముఖ్యంగా మహిళలు నేతృత్వం వహించే వ్యాపారాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. గోద్రేజ్ క్యాపిటల్ తన అనుబంధ సంస్థల ద్వారా ఎంఎస్ఎంఈ లు, వ్యక్తిగత రుణగ్రస్తులకు వివిధ రకాల రుణ ఉత్పత్తులను అందిస్తోందన్నారు.
దేశంలో దీర్ఘకాలిక, స్థిరమైన రిటైల్ ఆర్థిక సేవల వ్యాపారాన్ని నిర్మించడంపై కంపెనీ దృష్టి సారించిందన్నారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. ఇటీవల ప్రారంభించిన ఎంఎస్ఎంఈ పాలసీ ద్వారా ప్రభుత్వం వెనుకబడిన ఎంఎస్ఎంఈ లకు క్రెడిట్ యాక్సెస్‌ను పెంచడంతో పాటు ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యం పొందేలా క్రుషి చేస్తుందన్నారు. ఈ భాగస్వామ్యం తెలంగాణలో ఎంఎస్ఎంఈ ల వృద్ధిని వేగవంతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుందని, మహిళా వ్యవస్థాపకులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. స్థానిక ఎంఎస్ఎంఈ లకు, ముఖ్యంగా మహిళా వ్యవస్థాపకులకు వినూత్నమైన, డిజిటల్ - ఫస్ట్ లెండింగ్ సొల్యూషన్స్, ఆర్థిక ఉత్పత్తులను అందించడానికి గోద్రేజ్ క్యాపిటల్ అనుబంధ సంస్థలతో సహకరించడంపై హర్షం వ్యక్తం చేశారు.






