- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ఇన్-సర్వీస్ టీచర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఏడాదికి అదనంగా 2 స్పెషల్ టెట్ పరీక్షలు
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఇన్ సర్వీస్ టీచర్లు తప్పనిసరిగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) అర్హత సాధించాల్సి ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ అర్హత సాధించడం తప్పనిసరి అని తేల్చి చెప్పిన నేపథ్యంలో ఉపాధ్యాయుల ప్రయోజనార్ధం ఏడాదికి రెండు స్పెషల్ టెట్ (Telangana Special TET) పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ డాక్టర్ యోగితా రాణా బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ప్రతి ఏడాది నిర్వహించే రెండు సాధారణ టెట్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. వీటికి అదనంగా కేవలం ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం మరో రెండు ప్రత్యేక టెట్ పరీక్షలను నిర్వహించనున్నారు. దీంతో ఇకపై రాష్ట్రంలో ఏటా జరిగే రెగ్యులర్ టెట్‌లతో పాటు సర్వీస్‍లో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి.
ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తుల మేరకు:
టీచర్ల నియామకాలు, ప్రమోషన్ల ప్రక్రియకు టెట్ అర్హత తప్పనిసరి కావడంతో.. ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన ప్రభుత్వం ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక టెట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి తదుపరి అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. అలాగే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, టెట్ చైర్మన్ సమర్పించిన ప్రతిపాదనలు, నివేదికలను కూడా సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. ఈ నిర్ణయంతో టెట్ పరీక్ష అర్హత సాధించేందుకు ఉపాధ్యాయులకు అదనపు అవకాశం లభించినట్లయింది.






