తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త.. 15 రోజుల్లో న్యూ హెల్త్ స్కీమ్

by Prasad Jukanti |   (  Updated:2026-02-12 13:22:19  IST  )

తెలంగాణ సచివాలంయలో సీఎస్ అధ్యక్షతన జరిగిన ఈహెచ్ఎస్ ట్రస్టు సమావేశంలో ఉద్యోగులకు కొత్త హెల్త్ స్కీమ్ పై కీలక నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ  ఉద్యోగులకు శుభవార్త.. 15 రోజుల్లో  న్యూ హెల్త్ స్కీమ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ (EHS) విషయంలో కీలక అప్ డేట్ వచ్చింది. ఉద్యోగుల హెల్త్ కార్డుల సమస్యపై ఇవాళ రాష్ట్ర సచివాలయంలో సీఎస్ కె.రామకృష్ణారావు (Ramakrishna Rao) అధ్యక్షతన ఈహెచ్ఎస్ ట్రస్టు సమావేశం జరిగింది. సంబంధిత శాఖ అధికారులు, ఉద్యోగుల సంఘాలు హాజరైన ఈ సమావేశంలో ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకం 15 రోజుల్లో ప్రారంభించాలని నిర్ణయించారు. ఉద్యోగుల మూల వేతనంలో 1.5 శాతం ఆరోగ్య పథకానికి చెల్లించేలా నిర్ణయించారు. అలాగే ఉద్యోగులు చెల్లించిన అంతే మొత్తం ప్రభుత్వం కూడా చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు సిద్ధం చేయాలని సీఎస్ కె.రామకృష్ణరావు ఉన్నతాధికారులను ఆదేశించారు.

GPO పోస్టులకు సర్వీస్ రూల్స్ ఖరారు.. అధికారిక ఉత్తర్వులు విడుదల

Next Story