గుడ్‌న్యూస్.. వచ్చే నెల మొదటి వారంలో టీజీసెట్స్ నోటిఫికేషన్లు

by Ramesh Naini |

రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల (టీజీసెట్స్ 2026) సందడి మొదలైంది.

గుడ్‌న్యూస్.. వచ్చే నెల మొదటి వారంలో టీజీసెట్స్ నోటిఫికేషన్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల (టీజీసెట్స్ 2026) సందడి మొదలైంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లను ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. నోటిఫికేషన్ల విడుదలకు ముందుగా, ఈ నెల 30న ఈఏపీసెట్‌ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రవేశ పరీక్షల నిర్వహణ, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ, పరీక్షా కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై ఉన్నత విద్యా మండలి అధికారులు వివిధ సెట్ల కన్వీనర్లతో సమగ్రంగా చర్చించనున్నారు. ఇప్పటికే ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం, మే మొదటి వారం నుంచి ఈ ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు, మే 9, 10, 11 తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరగనున్నాయి. మే 12న ఎడ్ సెట్, మే 13, 14 తేదీల్లో ఐసెట్, మే 15న ఈ సెట, మే 18న లాసెట్, పీజీఎల్ సెట్, మే 28, 31 తేదీల్లో పీజీఈసెట్, మే 31 నుంచి జూన్ 3 వరకు పీఈసెట్ పరీక్షలు జరగనున్నాయి.

Next Story