- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు గుడ్ న్యూస్.. టీజీ పీఈసెట్ -2026 షెడ్యూల్ విడుదల..
రాష్ట్రంలోని బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పీఈసెట్-2026 నోటిఫికేషన్, పరీక్షల షెడ్యూల్ ఖరారైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పీఈసెట్-2026 నోటిఫికేషన్, పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన మొదటి టెస్ట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. జీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి, శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, టీజీపీఈసెట్ చైర్మన్ ప్రొఫెసర్ యు. ఉమేష్ కుమార్, కన్వీనర్ ప్రొఫెసర్ రాజేష్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అభ్యర్థుల అర్హత ప్రమాణాలు, పరీక్షా విధానం, నిబంధనలపై చర్చించి కమిటీ ఆమోదం తెలిపింది. శాతవాహన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 25 న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. మార్చి 2 నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఆలస్య రుసుము లేకుండా మే 5 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే 20 వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తుకు గడువు విధించారు. ఫిజికల్ ఎఫిషియన్సీ, స్కిల్ టెస్ట్ మే 31 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనున్నారు. టీఅభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఫిబ్రవరి 25 నుండి https://pecet.tsche.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.






