- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్ పోలీసులతో కలిసి పనిచేసే అవకాశం!
హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం విద్యార్థుల కోసం అద్భుతమైన అవకాశాన్ని ప్రకటించింది. యువత కోసం సరికొత్త ఇంటర్న్‌షిప్, వాలంటీర్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: నగర పోలీసులు సరికొత్త నిర్ణయంతో ముందుకొచ్చారు. విద్యావంతులైన యువతలోని సృజనాత్మకతను, సాంకేతిక నైపుణ్యాన్ని పోలీసింగ్‌లో భాగస్వామ్యం చేసేందుకు 'ఇంటర్న్‌షిప్', 'ప్రొఫెషనల్ వాలంటీర్' ప్రోగ్రామ్‌లను ప్రారంభించారు. దీని ద్వారా అటు విద్యార్థులకు ప్రభుత్వ పరిపాలనపై అవగాహన, ఇటు పోలీస్ శాఖకు నూతన దృక్పథం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ వివరాలు..
ఈ ప్రోగ్రామ్ ముఖ్యంగా డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థుల కోసం ఉద్దేశించబడింది. 25 ఏళ్ల లోపు వయస్సు ఉండి, ప్రస్తుతం డిగ్రీ లేదా పీజీ చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి డేటా అనాలసిస్, రీసెర్చ్ ప్రాజెక్టులు, ఆధునిక పోలీసింగ్ పద్ధతులకు సంబంధించిన పనులను కేటాయిస్తారు. ప్రోగ్రాంను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి అధికారిక సర్టిఫికెట్ అందజేస్తారు. ఈ ప్రక్రియ అంతా పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో ఎస్‌ఎమ్‌ఐటీ (SMIT) సెల్ ద్వారా జరుగుతుంది.
ప్రొఫెషనల్ వాలంటీర్ ప్రోగ్రామ్..
కేవలం విద్యార్థులే కాకుండా, వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్న నిపుణులు కూడా 'వాలంటీర్'గా చేరి తమ సేవలను అందించవచ్చు. సాంకేతిక లేదా ప్రక్రియ ఆధారిత పనుల్లో వీరు పోలీసులకు సహకరించవచ్చు. ఈ అంశంపై నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. ‘విద్యార్థులు పోలీసు అధికారులతో కలిసి పనిచేస్తూ, విభాగపు పనితీరులో సరికొత్త ఆలోచనలను జోడించడానికి ఇదొక చక్కని వేదిక. ఈ కార్యక్రమం ద్వారా అటు విద్యార్థులకు విలువైన అనుభవం, ఇటు పోలీస్ శాఖకు యువత నుంచి నూతన దృక్పథం లభిస్తాయి’ అని తెలిపారు.
దరఖాస్తు చేసుకోవడం ఎలా?
ఆసక్తి కలిగిన విద్యార్థులు, నిపుణులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. హైదరాబాద్ పోలీస్ అధికారిక వెబ్‌సైట్ www.hyderabadpolice.gov.in సందర్శించండి. అందులో ఉన్న నిర్దేశిత లింక్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను నింపండి. అర్హత ప్రమాణాలు మరియు మార్గదర్శకాలను పూర్తిగా చదివి దరఖాస్తును సమర్పించండి. ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా విద్యార్థులు నేర పరిశోధన, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, సోషల్ మీడియా పోలీసింగ్ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవచ్చని హైదరాబాద్ సిటీ పోలీస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.






