- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు తీపికబురు.. 21 వస్తువులతో ‘స్పెషల్ కిట్’!
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రతి విద్యార్థికి 21 వస్తువులతో కూడిన స్పెషల్ కిట్ ఇవ్వాలని నిర్ణయించింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పట్ల ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే కాకుండా, విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాబోయే 2026-27 విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో కొత్త నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది.
ఇక ఒకే రంగు యూనిఫామ్..
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరిలో సమానత్వ భావం పెంపొందించేందుకు ప్రభుత్వం ‘ఒకే రాష్ట్రం - ఒకే యూనిఫామ్’ విధానాన్ని తీసుకురానుంది. గతంలో పాఠశాలల రకాలను బట్టి వేర్వేరు రంగులు ఉండగా, ఇకపై అన్ని స్కూళ్లలో ఒకే రంగు, డిజైన్ ఉన్న యూనిఫామ్ అమలు చేయనున్నారు. ఇది విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపును ఇవ్వడమే కాకుండా, ప్రభుత్వ పాఠశాలలకు ఓ బ్రాండ్ ఇమేజ్‌ను తీసుకువస్తుందని విద్యాశాఖ భావిస్తోంది.
21 వస్తువులతో కూడిన 'స్పెషల్ కిట్'
విద్యార్థుల చదువుకు కావాల్సిన సామాగ్రి కోసం తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం 21 వస్తువులతో కూడిన భారీ స్కూల్ కిట్‌ను సిద్ధం చేస్తోంది. ఆ కిట్‌లో మూడు జతల యూనిఫామ్ క్లాత్, షూస్, రెండు జతల సాక్స్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, టై, నోట్ బుక్స్, పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్, షార్ప్‌నర్, జామెట్రీ బాక్స్, డిక్షనరీ వంటి అత్యవసర వస్తువులు ఉండనున్నాయి. పాఠశాలలు పున:ప్రారంభమయ్యే నాటికే విద్యార్థులందరికీ ఈ కిట్లు అందేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పేద, మధ్య తరగతి విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.






