- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
District level Sports meet: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ నెల 11 నుంచి జిల్లా స్థాయి క్రీడా పోటీలు
విద్యార్థులకు ఆటవిడుపుగా అనేక క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నామని మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తరగతి గదిలో పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులకు ఆటవిడుపుగా అనేక క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నామని మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు (Badugu Saidul) తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి పది జిల్లాల్లోని 20 ప్రాంగణాల్లో ఈనెల 11 నుంచి 13 వరకు నిర్వహించే జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్‌లో 294 గురుకుల పాఠశాల నుంచి 12570 మంది విద్యార్థులు పాల్గొంటారని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 19 సంవత్సరాల లోపు విభాగంలో ప్రతి స్కూల్ నుంచి 20 మంది విద్యార్థులు, 14 సంవత్సరాల లోపు విభాగంలో ప్రతి స్కూల్ నుంచి 25 మంది విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. 19 సంవత్సరాల లోపు విభాగంలో 5220 మంది విద్యార్థులు, 14 సంవత్సరాల లోపు విభాగంలో 7350 మంది విద్యార్థులు పాల్గొంటారన్నారు.
మూడు రోజుల పాటు జరిగే జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ లో పాల్గొన్నే విద్యార్థులకు రన్నింగ్, లాంగ్ జంప్, హైజంప్, షార్ట్ పుట్, డిస్క్ త్రో, కబడ్డీ, కోకో, వాలీబాల్, టెన్నికాయిట్, చెస్ తదితర పోటీలను నిర్వహిస్తామన్నారు. ఈ పోటీలలో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో త్వరలో స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి వారికి అవసరమైన శిక్షణ ఇచ్చి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 6 నుంచి 8 వరకు 17 సంవత్సరాల లోపు విభాగంలో నిర్వహించిన పోటీల్లో 294 బీసీ గురుకుల పాఠశాల నుంచి 10290 విద్యార్థులు పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి కల్చరల్ కార్నివాల్ లో అవకాశం:
ఈనెల 15 నుంచి 25 వరకు జిల్లా స్థాయిలో సాంస్కృతిక , సాహిత్య, వ్యాసరచన, చిత్రలేఖనం వంటి తదితర పోటీలను నిర్వహిస్తామన్నారు. ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎంపికైన విద్యార్థులు వచ్చేనెల రాష్ట్ర స్థాయిలో నిర్వహించే కల్చరల్ కార్నివాల్ లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. చదువుతోపాటు అన్ని రంగాలలో రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలన్న సీఎం రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం సూచన మేరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.






