TG News : రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్

by Muthe.Rajitha |

రేషన్ కార్డుదారులకు(Ration Card holders) రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది.

TG News : రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : రేషన్ కార్డుదారులకు(Ration Card holders) రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ(Telangana)లో జూన్ 2 నుంచి జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించి మూడు నెలల ఉచిత రేషన్(3 Months Free Ration) బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సాంకేతిక సమస్యలు, లాజిస్టిక్ ఇబ్బందుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రేషన్ పంపిణీలో తీవ్ర ఇబ్బందులు ఎదురువతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపై ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. 3 నెలల రేషన్ పంపిణీ గడువు ఈనెల 30 వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తొలుత ఈ పంపిణీ జూన్ 10 లోపు పూర్తి చేయాలని అనుకున్నప్పటికీ.. ఈ-పాస్ యంత్రాల ద్వారా బయోమెట్రిక్ విధానంలో ఒక్కో వ్యక్తికి మూడు నెలల రేషన్ కోసం ఆరుసార్లు వేలిముద్రలు తీసుకోవడం, సాంకేతిక సమస్యలు, నెట్‌వర్క్ అంతరాయం వల్ల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కాగా లబ్దిదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, వారికి పంపిణీ చేసే 3 నెలల స్టాక్ రెడీగా ఉందని సర్కార్ పేర్కొంది. ఈ నెల 30 వరకు అన్ని రేషన్ షాపులు పని చేస్తాయని, ఈలోపు ఎప్పుడైనా తీసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.

Next Story