మధ్యాహ్న భోజన నిర్వాహకులకు గుడ్‌ న్యూస్.. రూ.28.44 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-17 04:21:43  IST  )

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహకులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.

మధ్యాహ్న భోజన నిర్వాహకులకు గుడ్‌ న్యూస్.. రూ.28.44 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహకులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం (PM Poshan) కింద 9, 10వ తరగతుల విద్యార్థులకు వంట ఖర్చుల కోసం భారీ మొత్తాన్ని విడుదల చేసింది. అందుకు సంబంధించి విద్యా శాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ (Naveen Nicholas) ఆదేశాల మేరకు రూ.28,43,76,000 నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిధులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 2025 వరకు, జూన్, జూలై 2025లకు సంబంధించిన వంట ఖర్చులు, పెండింగ్ బిల్లుల చెల్లింపుకు సంబంధించినవని అధికారులు వెల్లడించారు. ఇందులో ప్రధానంగా జనరల్ (GEN), ఎస్సీ, ఎస్టీ వర్గాలకు విడివిడిగా నిధులు కేటాయించారు. జనరల్ కేటగిరి పాఠశాలలకు రూ.1888.91 లక్షలు, ఎస్సీ కేటగిరీ స్కూళ్లకు రూ.584.14 లక్షలు, ఎస్టీ కేటగిరి పాఠశాలలకు రూ.370.71 లక్షలు మంజూరయ్యాయి.

పెండింగ్ ఎగ్స్ బిల్లులు రూ.25.65 కోట్లు విడుదల..

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం (Mid-day Meal Scheme) కింద 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు సరఫరా చేసే గుడ్ల ఖర్చుకు సంబంధించి పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాల మేరకు రూ.25,64,91,000 నిధులు విడదల చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, జూన్, జులై నెలలకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపునకు సంబంధించినది.

Next Story