జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. అక్రిడిటేషన్లపై BIG అప్‍డేట్

by Prasad Jukanti |   (  Updated:2026-03-18 07:13:36  IST  )

వచ్చే రెండు నెలల్లో డిజిటల్ మీడియా పాలసీని తీసుకువస్తామని, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలు ఇస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

జర్నలిస్టులకు గుడ్ న్యూస్..  అక్రిడిటేషన్లపై BIG అప్‍డేట్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: డెస్క్, ఫీల్డ్ జర్నలిస్టులను వేరు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని, నిజమైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు (Accreditation Cards) ఇవ్వాలన్నదే మా లక్ష్యం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. ఇవాళ శాసనమండలిలో ప్రశ్నొత్తరాల సమయంలో పలువురు విపక్ష సభ్యులు జర్నలిస్టు సమస్యలపై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి.. అక్రిడిటేషన్ల విషయంలో ప్రభుత్వం తొలుత 252 జీవోను ఇచ్చిందని అయితే జర్నలిస్టు సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలతో ఆ జీవోను సవరించి ఇచ్చామన్నారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ విషయములో కొంత మంది లేనిపోని అపోహలను సృష్టిస్తున్నారు. అందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఓ కమిటీని ఏర్పాటు చేశామని, ఇంకా ఏవైనా సవరణలు చేయాల్సిన అవసరం ఉంటే సర్క్యులర్ జారీ చేయడానికి కూడా ఈ ప్రభుత్వం భేషజాలకు వెళ్లబోదన్నారు.

రెండు నెలల్లో డిజిటల్ మీడియా పాలసీ:

వచ్చే రెండు, మూడు నెలల్లో డిజిటల్ మీడియా పాలసీని (Digital Media Policy) తీసుకు రాబోతున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ పాలసీ ఓ రూపానికి తీసుకువచ్చామని త్వరలోనే ఫైనల్ చేస్తామన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. కోర్టుల్లో ఆటంకాలు లేకుండా ఇళ్ల స్థలాల పంపిణీకి యోచిస్తున్నామన్నారు. జర్నలిస్టులుక ఇళ్ల స్థలాలపై ఇటీవల మహిళా దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారని అతి కొద్దిరోజుల్లోనే ఆ తీపికబురు వినిపిస్తామన్నారు. జర్నలిస్టుల ఉద్యోగాల భద్రతా విషయంలో ఈ ప్రభుత్వం వెనకడుగు వేయబోదన్నారు.

Next Story