జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. ఇక పోస్టల్ బ్యాలెట్ లో ఓటేసే సదుపాయం

by Chukka Sudharani |   (  Updated:2023-10-19 06:19:18  IST  )

ప్రస్తుతం ఎలక్షన్ల వేడి పెరుగుతోంది. త్వరలో తెలంగాణతో సహా నాలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరగనున్నాయి.

జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. ఇక పోస్టల్ బ్యాలెట్ లో ఓటేసే సదుపాయం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఎలక్షన్ల వేడి పెరుగుతోంది. త్వరలో తెలంగాణతో సహా నాలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో తొలిసారిగా జర్నలిస్టులతో సహా 12 ఇతర విభాగాల ఉద్యోగులకు ఈసీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. ఎఫ్ సీఐ, ఎఎఐ, పీఐబీ, హెయిర్, విద్యుత్ శాఖ, రైల్వే, వైద్యారోగ్య శాఖ, హెయిర్ RTC, పౌరసరఫరాల శాఖ, బీఎస్ యన్ఎల్, వార్తల సేకరణ కోసం ఈసీ నుంచి పాస్ పొందిన జర్నలిస్టులు, ఫైర్ సిబ్బందికి కొత్తగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. అయితే.. ఇలా ఓటేసేందుకు ఈ అవకాశం కల్పించిన ఉద్యోగులు నవంబర్ 7వ తేదీలోగా ఫారం-12Dకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

Next Story