- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విధులు బహిష్కరించిన హైడ్రా మార్షల్స్‌కు గుడ్ న్యూస్.. రంగనాథ్ కీలక ప్రకటన
జీతాల్లో కోత విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో హైడ్రా మార్షల్స్(Hydraa Marshals) సోమవారం విధులు బహిష్కరించారు.

దిశ, వెబ్‌డెస్క్: జీతాల్లో కోత విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో హైడ్రా మార్షల్స్(Hydraa Marshals) సోమవారం విధులు బహిష్కరించారు. దీంతో వర్షాల వేళ నగర వ్యాప్తంగా ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోయాయి. వెంటనే అప్రమత్తమైన హైడ్రా కమిషనర్ రంగనాథ్(AV Ranganath) వారితో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. సుదీర్ఘ చర్చల అనంతరం రంగనాథ్ మాట్లాడుతూ.. హైడ్రాలో పనిచేసే ఎవరి జీతాలూ తగ్గించం అని స్పష్టమైన ప్రకటన చేశారు. హైడ్రా మార్షల్స్ జీతాలు ఇంకా పెరుగుతాయని గుడ్ న్యూస్ చెప్పారు. ఓవర్ టైమ్ అంశాన్ని పరిశీలిస్తామని ఈ సందర్భంగా రంగనాథ్ హామీ ఇచ్చారు. అనంతరం హైడ్రా మార్షల్స్ మాట్లాడుతూ.. తమ సమస్యలపై కమిషనర్ రంగనాథ్ సానుకూలంగా స్పందించారని అన్నారు. జీతాల విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారని తెలిపారు. రెండు నెలల్లో జీతాలు పెంచుతామన్నారని మార్షల్స్ పేర్కొన్నారు. కమిషనర్ హామీ మేరకు 3 నెలలు వేచి చూస్తామని మార్షల్స్ ప్రకటన చేశారు.






