- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల వరకు ‘రైతుభరోసా’ నిధులు జమ
దిశ, వెబ్‌డెస్క్: వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద ‘రైతు భరోసా’ నిధులను సోమవారం సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే. తొలిరోజు 2 ఎకరాల వరకు ఉన్న రైతులందరి బ్యాంకు ఖాతాల్లోకి ఎకరానికి రూ.6 వేల చొప్పున నిధులను జమ చేశారు. 41.25 లక్షల మంది అన్నదాతలకు సంబంధించి 39.16 లక్షల ఎకరాలకు రూ.2,349.83 కోట్లు జమయ్యాయి. ఇక రెండో రోజు (నేడు) 3 ఎకరాల్లోపు భూమి ఉన్న 10.45 లక్షల మంది రైతులకు గాను రూ.1,551.89 కోట్లు విడుదల చేసినట్లుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. ఎకరాలతో సంబంధం లేకుండా త్వరలోనే మిగతా రైతులకు కూడా ‘రైతు భరోసా’ అందుతుందని, ఎవరూ నిరాశ పడాల్సిన అవసరం పేర్కొన్నారు. బ్యాంకులతో ఎలాంటి చిక్కులు లేకుండా.. రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ చేస్తున్నామని తెలిపారు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.