- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలోని రైతులకు తీపికబురు.. ఒకే విడతలో ‘రైతు భరోసా’ పంపిణీ
మధిర సభ వేదికగా ఈనెల 30న రూ.9 వేల కోట్ల ‘రైతు భరోసా’ నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వానికి ఆర్థిక భారమైనా రైతులకు భరోసా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 30న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో జరగనున్న బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ప్రారంభంకావడంతో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కొత్త పట్టా పాసు బుక్వివరాలను సీసీఎల్‌ఏ నుంచి ప్రభుత్వం తెప్పించుకుంది. మొత్తం 73 లక్షల మంది రైతుల ఖాతాలో రూ.9 వేల కోట్లు జమ చేసేందుకు పక్కాగా ప్లాన్చేస్తోంది. యాసంగిలో రెండు ఎకరాలకే పెట్టుబడి సాయం అందించడంతో రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో దాని నుంచి బయటపడేందుకు ఒకేసారి జమ చేస్తే బాగుంటుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఇక నిధుల కొరత ఏర్పడితే మొదట ఎకరం చొప్పున 9 రోజుల్లో పూర్తిగా పంపిణీ చేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖలో టాక్వినిపిస్తోంది.
ఏడున్నర ఎకరాలకే..
మరోవైపు యాసంగి సీజన్‌లో భరోసా సాయం అందజేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రబీ సీజన్‌లో పంటల సాగు తక్కువగా ఉంటుంది. వరి, మొక్కజొన్న కూరగాయల పంటలు మాత్రమే సాగు అవుతాయి. అయితే వరి తర్వాత పెద్ద మొత్తంలో సాగు చేసే పంట పత్తి. ఇది వానాకాలంలోనే వేయగా జనవరి వరకు పూర్తవుతుంది. రెండోసారి రబీలో సాగు చేయరు. అలాంటప్పుడు పత్తికి పెట్టుబడిసాయం ఎందుకని ప్రభుత్వ పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది. దీంతో రైతు భరోసా ఒక ఖరీప్సీజన్కే పంపిణీ చేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖలో ప్రచారం జరుగుతోంది. ధనవంతులైన రైతులకు కూడా భరోసా ఇస్తే ప్రభుత్వానికి ప్రయోజనం లేదని, సన్న, చిన్న కారు రైతులకే వేయాలనే అంచనాకు వచ్చినట్టు సమాచారం. వచ్చే వానాకాలం 7.20 గుంటల వరకు పరిమితి పెట్టి ఆ లోపు భూమి కలిగిన వారికే భరోసా సాయం అందజేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో 1.50 కోట్ల ఎకరాల భూమి ఉంటే అందులో 20 నుంచి 25 లక్షల ఎకరాల భూమి రియల్ఎస్టేట్, కాలువలు, కుంటలు, బీడు భూములు, సాగుకు పనికిరాని పడావు భూములున్నాయి. వీటిని భరోసా జాబితా నుంచి ప్రభుత్వం ఇప్పటికే తొలగించనుంది.
ఒకే పంటకు సాయం
రైతు భరోసా నిధులు సాగు చేసే రైతులకే పంపిణీ చేయాలని లక్ష్యంగా రేవంత్ప్రభుత్వం ప్లాన్చేస్తోంది. గత బీఆర్ఎస్ప్రభుత్వం సాగు అంటే తెలియని పట్టాదారు పాస్ బుక్కలిగినవారందరికీ అప్పన్నంగా పెట్టుబడి సాయం ఖాతాలో జమ చేసింది. అయితే ఇకనుంచి ప్రజల సొమ్ము వృథా కాకుండా పంట సాగుచేసే వారికే భరోసా సాయం అందించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అవసరమైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి రూ.15 వేలు పంపిణీ చేస్తే పార్టీకి, ప్రభుత్వానికి తిరుగు ఉండదని, స్థానిక ఎన్నికల్లో విజయం సాధించవచ్చనే అంశం ఇటీవల జరిగిన మంత్రి వర్గం సమావేశంలో చర్చకు వచ్చినట్టు సమాచారం. 10 ఎకరాలకుపైగా భూమి ఉన్నవారికి పెట్టుబడి సాయం అందిస్తే ఎలాంటి ఉపయోగం లేదని, పేద, మధ్యతరగతి రైతులకు వేస్తే అన్ని రకాలుగా ప్రయోజనం ఉంటుందని డిస్కస్చేసినట్టు టాక్ వినిపిస్తోంది. అదే విధంగా కౌలు రైతులను ఆదుకునేందుకు చట్టం తీసుకొచ్చి, వారికి భరోసా ఇచ్చే అంశంపై పరిశీలనచేయాలని ఒకరిద్దరు మంత్రులు ముఖ్యమంత్రి ముందు ప్రపోజల్ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.
శాటిలైట్ సర్వేనే కీలకం
ఇటీవల వ్యవసాయ విశ్వవిద్యాలయం శాటిలైట్చిత్రాల ఆధారంగా ప్రతి గ్రామంలో సర్వే నెంబర్వారీగా పంట విస్తీర్ణం లెక్కించేందుకు స్విట్జర్లాండ్దేశానికి చెందిన సార్ మ్యాప్సంస్థతో ఒప్పందం చేసుకుని, రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగు వివరాలను సేకరించింది. 95 శాతం ఎలాంటి పంటలు వేశారో గుర్తించింది. శాటిలైట్సర్వే చేసిన వివరాలను పైలెట్ప్రాజెక్టు కింద జిల్లాకు ఐదు గ్రామాలను ఎంపికచేసి ఏఈవోలతో సర్వే చేయించగా ఒకే విధంగా వచ్చింది. దీంతో ఇకనుంచి శాటిలైట్సర్వే ఆధారంగానే పెట్టుబడి సాయం అందించనుంది. ఈ సర్వే ద్వారా ప్రకృతి విపత్తులకు నష్టపోయిన రైతులను గుర్తించి పరిహారం అందజేయవచ్చు. సాగు చేసిన భూముల ఆధారంగా విత్తనాలు, ఎరువులు ఎంత కావాలో ముందుస్తుగా సిద్ధం చేసుకునే వీలుంటుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం పంట సాగు చేసిన రైతులకే అందుతుందని ప్రభుత్వం బలంగా భావిస్తోంది.






