- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల నిరీక్షణ
by Ramesh Naini |
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోందని తిరుమల అధికారులు తెలిపారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోందని తిరుమల అధికారులు తెలిపారు. సర్వదర్శనం కోసం ఏర్పాటు చేసిన అన్ని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోగా, భక్తులు శిలాతోరణం క్యూలైన్ వరకు వేచి ఉన్నారు. ఇదిలా ఉండగా, ఆదివారం ఒక్కరోజే 90,072 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.08 కోట్లుగా నమోదైంది. మరోవైపు 33,459 మంది భక్తులు తమ తలనీలాలను శ్రీవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వేసవి సెలవులు, వారాంతం కావడంతో తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండగా, దర్శనాల కోసం నిరీక్షణ సమయం పెరిగిందని అధికారులు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
Next Story






