'మెగా 158' సెట్స్‌లో సందడి చేసిన రామ్ చరణ్

by Pulgam srinivas |

‘మెగా 158’ సెట్స్‌లో రామ్ చరణ్ సందడి చేశారు.

మెగా 158 సెట్స్‌లో సందడి చేసిన రామ్ చరణ్
X

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'మెగా 158' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. బాబి కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫోటోల్లో రామ్ చరణ్, దర్శకుడు బాబి కొల్లి కలిసి కనిపించారు. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి - బాబి కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.

Next Story