రైతులకు గుడ్ న్యూస్.. ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి

by Prasad Jukanti |   (  Updated:2026-04-02 11:58:47  IST  )

ఇందిరమ్మ ఇండ్ల రెండు విడతపై మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్ చెప్పారు.

రైతులకు గుడ్ న్యూస్.. ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజా ప్రభుత్వం ఇది అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ తీసుకువచ్చిన ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పినట్లుగానే చేశామన్నారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం మిఠాయిపల్లిలో ఇవాళ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. రైతులకు, భూయజమానులకు భరోసా, అండగా ఉండేలా భూభారతి తీసుకువచ్చామన్నారు. ట్రైనింగ్ ఇచ్చి లైసెన్స్డ్ సర్వేయర్లను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్రతి మండలానికి స్పేర్‍లో ఉండేలా రోవర్లు అందుబాటులోకి తీసుకురాబోతున్నామ్నారు.

ఈ నెలాఖరులోపు రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు:

రాష్ట్రంలోని ఐదు మండలాల్లో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టర్ ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. దీంతో రిజిస్ట్రేషన్‍తో పాటు సరిహద్దులతో కూడిన మ్యాప్‍తో పాటు భూదార్ నంబర్ కేటాయించబోతున్నామన్నారు. ఈనెలాఖరులో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక జరుగుతుందని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసి చూపిస్తామన్నారు. కాగా ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టర్ ను పైలట్ ప్రాజెక్టు కింద ఖ‌‌‌‌మ్మం జిల్లా కూసుమంచి, భ‌‌‌‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట‌‌‌‌, రంగారెడ్డి జిల్లా అమన్‌‌‌‌గ‌‌‌‌ల్‌‌‌‌, సంగారెడ్డి జిల్లా వ‌‌‌‌ట్‌‌‌‌ప‌‌‌‌ల్లి, నారాయ‌‌‌‌ణ‌‌‌‌పేట జిల్లా కోస్గి మండ‌‌‌‌లాల్లో దీన్ని అమ‌‌‌‌లు చేయబోతున్నారు.

Next Story