- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy : నేటి అర్ధరాత్రి రైతులకు గుడ్ న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రైతులకు గుడ్ న్యూస్ తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రైతులకు గుడ్ న్యూస్ తెలిపారు. నేటి అర్థరాత్రి నుంచి రైతుల అకౌంట్లలో రైతు భరోసా నిధులు జమ కానున్నట్టు ప్రకటన చేశారు. నారాయణపేట(Narayanapeta) జిల్లా కోస్గి(kosgi) మండలం చంద్రవంచలో ఆదివారం జరిగిన రైతు భరోసా(Rythu Bharosa), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా(Indiramma Athmiya Bharosa), ఇందిరమ్మ ఇళ్ళు(Indiaramma Houses), కొత్త రేషన్ కార్డుల(New Ration Cards) పంపిణీ పథకాలను ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటున్నామని అన్నారు. రైతు భరోసాతో రైతులకు రూ.12 వేలు ఇస్తున్నామని, రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో రూ.12 వేలు ఇస్తున్నామన్నారు. ఏ పదవీ లేకుండా ప్రజలకు సేవ చేస్తుంటే ప్రతిపక్షం విమర్శలకు దిగుతున్నారని అన్నారు. ప్రజలకు, రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని.. భూమికి విత్తనానికి ఉన్న అనుబంధం.. రైతుకు కాంగ్రెస్ కు ఉందన్నారు. దేశంలో రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వం తమదేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.






