TG: పత్తి రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెలాఖరు వరకు అవకాశం

by Prasad Jukanti |

పత్తిరైతులకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీపి కబురు చెప్పింది. ఈ నెలాఖరు వరకు కొనుగోళ్లు చేస్తామని తెలిపింది.

TG: పత్తి రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెలాఖరు వరకు అవకాశం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని పత్తి రైతులకు (Telangana, Cotton Farmers) కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) తీపికబురు చెప్పింది. రైతుల వద్ద నిలువ ఉన్న, లేట్‌ క్రాఫ్‌ ద్వారా సేకరిస్తున్న పత్తిని కొనుగోళ్లను (Cotton Procurement Extension) పొడిగించింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar rao) అభ్యర్థన మేరకు పత్తి కొనుగోళ్లను ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తూ సీసీఐ తాజాగా నిర్ణయం తీసుకుంది. మంత్రి ఆదేశాలతో నిన్న వ్యవసాయశాఖ జాయింట్ సెక్రటరీ, కేంద్ర జౌళి శాఖకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం, సీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మంత్రి తుమ్మల సంతోషం వ్యక్తం చేశారు. పొడిగించిన గడువును వినియోగించుకొని పత్తిని అమ్ముకోవాలని పత్తి రైతులకు మంత్రి విజ్ఙప్తి చేశారు. కాగా రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల గడువును పొడిగించాలని ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రి తుమ్మల కోరిన సంగతి తెలిసిందే.

మొదటి నుంచి రైతులకు ఇబ్బందులే:

ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో సీసీఐ కొనుగోలు కేంద్రాని ముసివేస్తామని తొలుత అధికారులు ప్రకటించారు. దీంతో రైతులు ఇక ప్రైవేట్ వ్యాపారులనే ఆశ్రయించాల్సిందేనా అనే ఆందోళన వ్యక్తం అయింది. నిజానికి ఈ యేడాది సీజన్ ఆరంభం నుంచి సీసీఐ తేమ పేరిట కోతలు విధించి తమను ఇబ్బందులకు గురి చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర మొదట్లో రూ. 8110 ఉండగా తేమ పేరుతో కోత విధించడంతో చాలా మందికి ఎంఎంస్పీ లభించలేదని విచారం వ్యక్తం చేశారు. దీంతో తక్కువ ధరకే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సి వచ్చిందన్నారు. ఇక ఈ ఏడాది దిగుబడి తగ్గడంతో పాటు పంట ఆలస్యంగా చేతికొచ్చింది. ఏటా మార్చి వరకు కొనుగోలు చేసే సీసీఐ అధికారులు ఈసారి ముందుగానే కేంద్రాల ను మూసివేసేందుకు నిర్ణయించుకోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాజాగా కనుగోళ్లు పొడిగించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story