Congress: కాంగ్రెస్ శ్రేణులకు గుడ్ న్యూస్.. రెండు, మూడు రోజుల్లో పదవుల జాతర

by Prasad Jukanti |

టీ కాంగ్రెస్ లో డీసీసీ కమిటీల నియామకంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వన్ టు వన్ చర్చలు నిర్వహిస్తున్నారు.

Congress: కాంగ్రెస్ శ్రేణులకు గుడ్ న్యూస్.. రెండు, మూడు రోజుల్లో పదవుల జాతర
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ (Congress) నేతలకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీసీసీ కమిటీల నియామకంపై కసరత్తు తుది దశకు చేరుకుంది. మరో రెండు మూడు రోజుల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీలపై అధికారిక ప్రకటన రానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ మేరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉమ్మడి జిల్లాల ఇన్ చార్జీలు, డీసీసీ అధ్యక్షులతో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) వన్ టు వన్ చర్చిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కమిటీల విషయంలో పార్టీ నియమించిన ఉమ్డి జిల్లా ఇంచార్జీలు, పార్లమెంట్ ఇంచార్జీలు, అసెంబ్లీ ఇంచార్జీలతో పీసీసీ చీఫ్ సమావేశాలు నిర్వహించారు. నాయకులందరీ ఆమోదంతో ఏఐసీసీ సూచన మేరకు జిల్లా కమిటీలను కూర్పు చేస్తున్నారు. కమిటీల విషయంలో బేదాభిప్రాయాలు రాకుండా మరోసారి ఫైనల్ గా కమిటీల ఎంపికపై మహేశ్ కుమార్ గౌడ్ చర్చిస్తున్నారు. ఈ చర్చల అనంతరం రెండు, మూడు రోజులలో పూర్తిస్థాయి డీసీసీ కమిటీల (DCC Committees) ప్రకటించేలా కసరత్తు జరుగుతోంది. పది రోజుల క్రితం మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్ పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉండబోతున్నదని, త్వరలో గ్రామ, మండల, జిల్లా కమిటీలన్నీ పూర్తి చేస్తామని చెప్పారు.

Next Story