TG: న్యూఇయర్ వేడుకల స్పెషల్.. ఎంత తాగినా ఇంటికి సేఫ్‌గా, ఫ్రీగా వెళ్లొచ్చు

by Gantepaka Srikanth |

మందుబాబులకు తెలంగాణ గిగ్ వర్కర్స్ యూనియన్(TGPW) శుభవార్త చెప్పింది.

TG: న్యూఇయర్ వేడుకల స్పెషల్.. ఎంత తాగినా ఇంటికి సేఫ్‌గా, ఫ్రీగా వెళ్లొచ్చు
X

దిశ, వెబ్‌డెస్క్: మందుబాబులకు తెలంగాణ గిగ్ వర్కర్స్ యూనియన్(TGPW) శుభవార్త చెప్పింది. న్యూఇయర్ వేడుకల్లో భాగంగా ఇవాళ రాత్రి మద్యం సేవించిన వారికి టీజీపీడబ్ల్యూ ఆధ్వర్యంలో ఉచిత రవాణా కల్పించాలని నిర్ణయించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఈ ఉచిత రవాణా సౌకర్యం అందుబాటులో ఉండనుంది. క్యాబ్‌లు, ఆటోలు, ఈవీ బైక్‌లు సహా 500 వాహనాలను టీజీపీడబ్ల్యూ సిద్ధం చేసింది. ఉచిత రైడ్ కోసం 89770 09804 నెంబర్‌కు కాల్ చేయాలని టీజీపీడబ్ల్యూ విజ్ఞప్తి చేసింది.

మరోవైపు నూతన సంవత్సర వేడుకలను (New Year Restrictions) శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీసులు పలుచోట్ల కఠిన ఆంక్షలను విధించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి వేడుకల నిర్వహణకు అనుమతులు ఇచ్చినప్పటికీ, రాత్రి 12 గంటల వరకు మాత్రమే కార్యక్రమాలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించే నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు, అసాంఘిక చర్యలు, అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే నిర్వాహకులతో పాటు పాల్గొన్న వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఏ చర్యనైనా సహించబోమని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడరాదని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడిపితే సీజ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

Next Story