- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్ని రంగాల ఉద్యోగులకు తీపికబురు.. ఆ రోజున ‘పెయిడ్ హాలిడే’ ప్రకటన
రాష్ట్రంలో రేపు జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల సాధారణ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రేపు జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల సాధారణ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా పోలింగ్ రోజును ‘పెయిడ్ హాలిడే’ (వేతనంతో కూడిన సెలవు)గా ప్రకటిస్తూ కార్మిక శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని అన్ని ఫ్యాక్టరీలు, దుకాణాలు, వాణిజ్య సంస్థలు, పారిశ్రామిక సంస్థలలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులందరికీ ఈ సెలవు వర్తించనుంది. తెలంగాణ ఫ్యాక్టరీస్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ (1974), తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ (1988) ప్రకారం ప్రభుత్వం పెయిడ్ హాలీడేను ప్రకటించింది.
అదేవిధంగా పోలింగ్ సజావుగా సాగేందుకు, ఉద్యోగులకు సెలవు అమలయ్యేలా చూడాలని లేబర్ కమిషనర్, ఫ్యాక్టరీల డైరెక్టర్, అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిన అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఈ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని సూచించింది.
- Tags
- Telangana Municipal Elections 2026
- Paid Holiday
- Govt of Telangana
- G.O.Rt.No. 14
- Election Day Holiday
- February 11 Polling
- Labor Department Orders
- Municipal Corporation Elections
- Voting Awareness
- Paid Leave for Workers
- Telangana Shops and Establishments Act
- Factory Employees Holiday
- Hyderabad Elections
- Telangana News






