- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోల్డెన్ అవర్ కాపాడింది
సైబర్ మోసగాళ్ల బారినపడ్డ ఇద్దరు బాధితులు గోల్డెన్ అవర్‌లో మోసపోయినట్లు భావించి ఫిర్యాదు చేయడంతో వారి నుంచి దోచుకున్న నగదు మొత్తం తిరిగి వాపస్ వచ్చింది.

దిశ, సిటీక్రైం: సైబర్ మోసగాళ్ల బారినపడ్డ ఇద్దరు బాధితులు గోల్డెన్ అవర్‌లో మోసపోయినట్లు భావించి ఫిర్యాదు చేయడంతో వారి నుంచి దోచుకున్న నగదు మొత్తం తిరిగి వాపస్ వచ్చింది. బాధితులు స్పందించిన సమయానికి అనుగుణంగా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు స్పందించడంతో సైబర్ నేరగాళ్లకు షాక్ కొట్టినట్లైంది. పోలీసులు తెలిపిన వివరాలు..
క్రెడిట్‌కార్డు అప్‌డేట్ అంటూ..
హైదరాబాద్‌కు అంబర్‌పేట్‌కు చెంది న వ్యక్తి(53)కి గుర్తుతెలియని వ్యక్తులు ఆర్‌బీఎల్ బ్యాంక్ అప్‌డేట్స్ అంటూ ఏపీ కే ఫైల్‌ను పంపారు. ఆ ఫైల్‌ను క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోగానే అతని బ్యాంక్ లా వాదేవిలకు సంబంధించిన ఓటీపీలు, పి న్ నంబర్‌లు, పాస్‌వార్డులు తెలుసుకుని సైబర్ మోసగాళ్లు మోబీక్విక్, ఫ్లిప్‌కార్ట్‌ల లో డిజిటల్ గిఫ్ట్‌కార్డ్స్ రూపంలో ఆర్డర్ లు చేశారు. అనుమానించిన బాధితుడు వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైం కానిస్టేబుళ్లు శ్రీకాం త్ నాయక్, జావీద్ వేగంగా స్పందించి ముందుగా బాధితుడి ఫోన్‌లో నుంచి ఏ పీకే ఫైల్‌ను డిలీట్ చేసి ఆ తర్వాత సైబర్ చీటర్స్ ఆర్డర్ చేసిన గిఫ్ట్‌కార్డ్స్‌ను క్యాన్సిల్ చేసి రూ.లక్ష తిరిగి బాధితుడి ఖాతాలోకి వచ్చేలా చేశారు. ఇలా గోల్డెన్ అవర్‌లో చేసిన ఫిర్యాదు బాధితులను ఆర్థికంగా న ష్టపోకుండా ఊపిరి పోసింది. కాబట్టి బా ధితులు ఎవరైనా తాము సైబర్ మోసాని కి గురైనట్లు అనుమానించిన వెంటనే మొ దటి గంటలో ఫిర్యాదు చేస్తే మోసగాళ్లు బదిలీ చేసుకున్న నగదను ఆపేందుకు అ వకాశం ఉంటుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఆలస్యం చేస్తే నగదు తిరిగి రావడం చాలా కష్టమని పోలీసులు పేర్కొన్నారు.
రూ.5.23 లక్షలు వాపస్
హైదరాబాద్ యూసుఫ్‌గూడకు చెందిన సాఫ్ట్‌వేర్ (26) ఇంజినీర్ వా ట్సాప్‌కు డిసెంబర్ 5వ తేదీన గుర్తుతెలియని వ్యక్తులు ఎం.పరివాహాన్ పేరుతో ఏపీకే ఫైల్ లింక్‌ను పంపిం చి రూ.వెయ్యి ట్రాఫిక్ చలాన్‌ను కట్టా లని మెసేజ్ ద్వారా డిమాండ్ చేశా రు. దీంతో కంగారు పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆ లింక్‌ను క్లిక్ చేశాడు. అంతే ఫోన్ సైబర్ నేరగాళ్ల కంట్రోల్ కు వెళ్లిపోయి బాధితుడు క్రెడిట్ కా ర్డు లావాదేవిల ఓటీపీలు, పాసువార్డు లు, ఇతర ఓటీపీల విషయాలను తె లుసుకుని మొత్తం రూ.5.23 లక్షలు కొట్టేశారు. అనుమానం వచ్చిన వెం టనే బాధితుడు 1930కు ఫోన్ చేశా డు. దీంతో సైబర్ క్రైం పీఎస్ కానిస్టేబుల్ ప్రియాంక ఐసీఐసీఐ బ్యాంక్, అమెజాన్ ప్రతినిధులకు నోటీసులను జారీ చేసి రూ.5.23 లక్షలను తిరిగి వచ్చేలా చేశారు.






