- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వాతంత్య్ర దినోత్సవానికి గోల్కోండ ఫోర్ట్ ముస్తాబు.. భద్రత కట్టుదిట్టం
by Kema Shiva Kumar |
79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబైంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 10 గంటలకు రాణి మహల్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. అనంతరం గోల్కోండ కోటలో పోలీసు సిబ్బంది కవాతు నిర్వహించనున్నారు. ఆ తర్వాత వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలందించిన 25 మందికి పతకాలు ప్రదానం చేయనున్నారు. గురువారం సౌత్‌వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్, ఏసీపీ సయ్యద్ ఫయాజ్ గొల్కొండ కోటలో బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ జానపద నృత్యరీతులు, కళారూపాలు ప్రదర్శించనున్నారు. అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు వేడుకలు తిలకించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story






