నేడు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కీలక సమావేశం..

by velandi.Saikiran |   (  Updated:2025-04-07 05:54:17  IST  )

నేడు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ( Godavari River Management Board) కీలక సమావేశం జరుగనుంది. జల సౌధలో ఉదయం 11: 30

నేడు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కీలక సమావేశం..
X

దిశ, వెబ్ డెస్క్: నేడు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ( Godavari River Management Board) కీలక సమావేశం జరుగనుంది. జల సౌధలో ఉదయం 11: 30 గంటలకు బోర్డు చైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఇక గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కీలక సమావేశానికి ఏపీ (AP), తెలంగాణ ( Telangana) నీటిపారుదల శాఖ అధికారులు ( Irrigation Department officials ) హాజరుకానున్నారు.

బనకచర్ల, గోదావరి అనుసంధాన ప్రాజెక్ట్ లపై తెలంగాణ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కీలక సమావేశంలో చర్చ జరుగనుంది. అలాగే గోదావరిపై నిర్మించిన 16 ప్రాజెక్టులను GRMBకి అప్పగించడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వాస్తవంగా గోదావరి - బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా... పోలవరం నుంచి గోదావరి జలాలతో పాటు నాగార్జునసాగర్ నుంచి కృష్ణ వరద జలాలను తరలించాలని ఏపీ ప్రతిపాదిస్తోంది.

అదే సమయంలో గుంటూరు జిల్లాలో నిర్మించబోతున్న గొల్లపల్లి రిజర్వాయర్ లోకి... కృష్ణ వరద జలాలను తరలిస్తామని ఏపీ పేర్కొంటుంది. అయితే దీనిపైనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై కేంద్ర జలశక్తి శాఖకు కూడా ఫిర్యాదు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇలాంటి నేపథ్యంలోనే... గోదావరి బోర్డు సమావేశం జరుగుతుంది.

Next Story