భద్రాచలం వద్ద భయానకంగా గోదావరి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-20 03:16:50  IST  )

ఎగువ రాష్ట్రాలతో పాటు తెలంగాణ (Telangana)లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది (Godavari River) భయానకంగా ప్రవహిస్తోంది.

భద్రాచలం వద్ద భయానకంగా గోదావరి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఎగువ రాష్ట్రాలతో పాటు తెలంగాణ (Telangana)లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది (Godavari River) భయానకంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలోనే భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి భారీగా పెరగడంతో ప్రస్తుత నీటిమట్టం 43కు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ (District Collector)తో పాటు ఎస్పీ (SP) వరద ఉధృతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గోదావరి వరద ప్రవాహం పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని కూడా వారు అలర్ట్ పేర్కొన్నారు. ఒకవేళ వరదల సంభవిస్తే దాదాపు 15 గ్రామాలు ముంపునకు గురికానున్నాయి. ఈ క్రమంలోనే అధికారులు ఆయా గ్రామాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. రెండో ప్రమాద హెచ్చరిక దాటితే స్లూయిజ్‌లు లీక్ కాకుండా హెవీ మోటర్లను సిద్ధం చేసినట్లుగా సమాచారం.

Next Story