తెలంగాణ స్థానిక ఎన్నికల కోసం గోవా మద్యం..162 బాటిళ్లు సీజ్

by Ajay Maddhiboyina |

గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎక్సైజ్ శాఖ డిటిఫ్ సిబ్బంది మంగళవారం పట్టుకున్నారు. మెదక్ జిల్లా జహీరాబాద్‌ చీరాగ్‌పల్లి ఎక్సైజ్‌ చెక్‌పోస్టు తనిఖీలు నిర్వహించగా ఆక్రమంగా రవాణా చేస్తున్న

తెలంగాణ స్థానిక ఎన్నికల కోసం గోవా మద్యం..162 బాటిళ్లు సీజ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎక్సైజ్ శాఖ డిటిఫ్ సిబ్బంది మంగళవారం పట్టుకున్నారు. మెదక్ జిల్లా జహీరాబాద్‌ చీరాగ్‌పల్లి ఎక్సైజ్‌ చెక్‌పోస్టు తనిఖీలు నిర్వహించగా ఆక్రమంగా రవాణా చేస్తున్న 162 మద్యం బాటిళ్లను, కారును సీజ్ చేసినట్లు ఎక్సయిజ్ అధికారులు వెల్లడించారు. రానున్న స్థానిక సంస్థల నేపథ్యంలో ఎన్నికలో పోటీ చేసేందుకు మద్యం సమకుర్చుకున్నట్లు విచారణలో వెల్లడైనట్లు డిటీఎఫ్ సిబ్బంది తెలిపారు. కేసులో అరెస్టు చేయబడిన వ్యక్తి నల్గొండ జిల్లా పెద్ద అడిసెపల్లికి చెందిన జయంత్ రెడ్డిగా గుర్తించారు. పట్టుబడిన మద్యం విలువ రూ.1.50లక్షలు ఉంటుందని తెలపారు. ఈ దాడిలో డీటీఎఫ్ సంగారెడ్డి టీమ్‌, జీహీరాబాద్‌ ఎక్సైజ్‌ స్టేస్‌ టీమ్‌, జహీరాబాద్‌ చెక్‌పోస్టు టీమ్‌ పాల్గొన్నారు. గోవా మద్యం బాటిళ్లను పట్టు కున్న టీమ్‌ను ఎన్‌ఫొర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షాన్‌వాజ్‌ ఖాసీం, మెదక్‌ డిప్యూటి కమిషనర్‌ జె.హరి కిరణ్‌, ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ నవీన్‌ చంద్‌లు అభినందించారు.

Next Story