- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Accident: కుంభమేళాకు వెళ్లి తిరిగిరాని లోకాలకు..
మహా కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: మహా కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదం ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పొగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా వేడుక ఘనంగా జరుగుతుంది. ఈ వేడుకలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ కుంటుబం కారులో మహా కుంభమేళాకు వెళ్లింది. అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి తిరుగు పయనమయ్యారు. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే జరిగింది.
ఇంతలోనే దురదుష్టవశాత్తూ ఘోర ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొనటంతో ప్రమాదం జరిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతుల్లో జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి, ఆయన భార్య విలాసిని, కారు డ్రైవర్ న్యాల్‌కల్ మండలానికి చెందిన మల్లారెడ్డి ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






