కొత్త రిజర్వేషన్లపై రేపు జీవో విడుదల.. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్!

by Muthe.Rajitha |

రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

కొత్త రిజర్వేషన్లపై రేపు జీవో విడుదల.. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్!
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా బీసీల రిజర్వేషన్ల అంశంపై ఇన్నాళ్లు తర్జన భర్జనలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. 50 శాతం మించకుండా కొత్త రిజర్వేషన్లను అమలు చేసేందుకు శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గ్రామ పంచాయితీలు, వార్డుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేస్తూ పంచాయితీ రాజ్ శాఖ రేపు జీవో జారీ చేయనుంది. కాగా కొత్త రిజర్వేషన్లను సిఫార్సు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిను ఇదివరకే మంత్రివర్గం ఆమోదించిన సంగతి తెలిసిందే.

గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు మంత్రులకు ఫైల్ పంపి సంతకాలు తీసుకునే ప్రక్రియ కూడా పూర్తయింది. దీంతో రిజర్వేషన్లపై రేపు జీవో రానుంది. అనంతరం ఒకటీ రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఈ ప్రకారం స్థానిక ఎన్నికలు డిసెంబర్ రెండవ వారంలో జరగవచ్చునని అధికారులు చెబుతున్నారు.

Next Story