- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BJP MLC: బీజేపీ ఎమ్మెల్సీ వర్సెస్ నిరుద్యోగులు.. ఇందిరా పార్కు ధర్నాలో ప్రసంగాన్ని అడ్డుకున్న నిరుద్యోగులు
ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగుల మహాగర్జన ధర్నాలో గందరగోళం నెలకొంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇందిరాపార్కు వద్ద నిరుద్యోగ మహాగర్జనలో గందరగోళం ఏర్పడింది. బీజేపీ ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి (BJP MLC Anji Reddy) ప్రసంగాన్ని నిరుద్యోగులు అడ్డుకున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఇవాళ ఇందిరాపార్కు ధర్నా చౌక్ (Indira Park Dharna Chowk) వద్ద నిరుద్యోగులు మహాగర్జన నిర్వహించారు. ఆందోళనకు వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల నాయకులు, ఉద్యమకారులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి నిరుద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా నిరుద్యోగులు అడ్డుకున్నారు. ఇక్కడున్న నిరుద్యోగులంతా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారేనని అలాంటి మేము జీవో 46 (GO 46) విషయంలో రెండేళ్లుగా కొట్లాడుతుంటే బీజేపీ దీనిపై ఒక్కమాట కూడా మాట్లాడలేదని నిలదీశారు. ఇవాళ మీరు వచ్చి మీ వెర్షన్ మాట్లాడి వెళ్లిపోతారు. కానీ జీవో 46 బాధితులు వారి బాధను ఎవరితో చెప్పుకోవాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ విషయం పక్కన పెడితే బీజేపీ ఏం చేసిందని అడ్డుకున్నారు. దీంతో అంజిరెడ్డి స్పందిస్తూ నిరుద్యోగుల కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ ధర్నా చేశారని ఇది మీ కళ్లకు కనిపించడం లేదనా, గ్రూప్ -1 విషయంలో అంజిరెడ్డి నిరుద్యోగులకు అండగానిలిచారని ఇది గుర్తుపెట్టుకోవాలన్నారు. దీంతో స్పందించిన నిరుద్యోగులు (Unemployed Youth) బండి సంజయ్ జీవో నంబర్ 29 విషయంలో ధర్నా చేశారని జీవో 46 విషయంలో ఏం ఎందుకు మాట్లాడలేదన్నారు. దీంతో కాసేప అక్కడ గందరగోళం ఏర్పడింది. అనంతరం మాట్లాడిన అంజిరెడ్డి.. నిరుద్యోగుల పక్షాన బీజేవైఎం అనేక ధర్నాలు చేపట్టిందని బీజేపీ నాయకులపై అయినన్ని కేసులు మరే పార్టీ నాయకుల మీద కాలేదని, నిరుద్యోగులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.






