- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్లోబల్ సమ్మిట్ పనులు 5 లోపు పూర్తవ్వాలి.. ఏర్పాట్లపై మంత్రి శ్రీధర్‌బాబు కీలక ఆదేశాలు

దిశ, తెలంగాణ బ్యూరో: గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించి అన్ని పనులు ఈ నెల 5వ తేదీలోపు పూర్తి చేయాలని, 6న డ్రై రన్ నిర్వహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను మంగళవారం మంత్రి శ్రీధర్‌బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద సీఎస్, ఇతర విభాగాల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సలహాలు, కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా.. తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏ ఒక్క చిన్న పొరపాటు జరగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే డెలిగేట్స్, మన అతిథులు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. పార్కింగ్, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అలాగే.. విభాగాల వారీగా అప్పగించిన బాధ్యతలు, వాటి పురోగతిపై సమీక్షించారు.






