- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో రెండు నెలల సమయం ఇవ్వండి.. సుప్రీంకోర్టులో అసెంబ్లీ కార్యదర్శి పిటిషన్
ఎమ్మెల్యేల అనర్హత అంశంలో మరో రెండు నెలల సమయం కావాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తరుపున అసెంబ్లీ కార్యదర్శి సుప్రీంకోర్టులో..

- ఎమ్మెల్యేల అనర్హత అంశంపై విచారణ పూర్తి కాలేదు
- ఆరుగురు ఎమ్మెల్యే విచారణ పూర్తి కాలేదు
- సుప్రీంకోర్టులో స్పీకర్ తరుఫున అసెంబ్లీ కార్యదర్శి పిటిషన్
దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్యేల అనర్హత అంశంలో మరో రెండు నెలల సమయం కావాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తరుపున అసెంబ్లీ కార్యదర్శి సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ ఎమ్మెల్యే అనర్హత అంశంపై విచారణ చేపట్టినట్లు పిటిషన్ లో పేర్కొన్నారు. పదిమంది ఎమ్మెల్యేలను విచారణలో నలుగురు ఎమ్మెల్యేల విచారణ ప్రక్రియ మాత్రమే పూర్తియినట్లు వివరించారు. మరో ఆరుగురు ఎమ్మెల్యేలను విచారించాల్సి ఉందని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు రెండు నెలల సమయం పడుతుందని, అందుకు అనుమతించాలని పిటిషన్ లో కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలు చేపట్టాలని స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుప్రీంకోర్టును జూలై లో ఆశ్రయించారు. మూడు నెలలలోపు చర్యలు చేపట్టాలని స్పీకర్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన పక్షంలో స్పీకర్ ఎమ్మెల్యే అనర్హత పై విచారణ చేపట్టడం జరిగింది.






