- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్యాకల్టీకి ప్రత్యేక బదిలీలు ఇవ్వండి : ప్రభుత్వ వైద్యుల సంఘం
by Naga Rani Yarlagadda |
తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం, తెలంగాణ టీచింగ్ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు సోమవారం..

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం, తెలంగాణ టీచింగ్ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు సోమవారం మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌ను కలిశారు. చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్న ఫ్యాకల్టీకి ప్రత్యేక బదిలీలు నిర్వహించాలని, అనంతరం అందుబాటులో ఉన్న అన్ని ఖాళీలను పరిగణనలోకి తీసుకొని ప్రొఫెసర్ ప్రమోషన్లు చేపట్టాలని కోరారు. ఇక పెరిఫెరల్ మెడికల్ కాలేజీల భత్యాన్ని అమలులోకి తేవాలని, తద్వారా పెరిఫెరల్ సంస్థల్లో ఫ్యాకల్టీ సేవలందించేందుకు ప్రోత్సాహం కలుగుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం తరఫున అధ్యక్షుడు నరహరి, కార్యదర్శి లల్లూ, తెలంగాణ టీచింగ్ ప్రభుత్వ వైద్యుల సంఘం తరఫున అధ్యక్షుడు కిరణ్ బొల్లేపాక, సెక్రెటరీ జనరల్ కిరణ్ మాదల, బొంగు రమేశ్, పల్లం ప్రవీణ్, రఘు, శేఖర్ ఇతర వైద్యులు హాజరయ్యారు.
Next Story






