- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా పైసలు నాకు ఇచ్చేయండి.. ఓటర్లపై ఓడిపోయిన అభ్యర్థి ఆగ్రహం
తెలంగాణలో గురువారం తొలివిడత పంచాయితీ ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చేశాయి. అయితే ఎన్నికల్లో విజయం

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో గురువారం తొలివిడత పంచాయితీ ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చేశాయి. అయితే ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు సంబురాల్లో మునిగి తేలుతుంటే ఓడిపోయిన అభ్యర్థులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు డబ్బులు పంచి ఓడిపోయామని తీవ్ర ఆవేదన చెందుతూ తాము పంచిన డబ్బులను తిరిగి ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ మండలంలోని సోమ్లా తండాలోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది.
సర్పంచ్ అభ్యర్థిగా భూక్యా కౌసల్య నామినేషన్ వేయగా ఆమెపై 27 ఓట్ల తేడాతో ఇస్లావత్ సుజాత అనే అభ్యర్థి విజయం సాధించింది. దీంతో తనకు ఓటు వేయలేదని ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఓడిపోయిన అభ్యర్థి ఇంటింటికి వెళ్లి డిమాండ్ చేస్తోంది. డబ్బులు తిరిగి ఇవ్వాలని లేదంటే జెండా పట్టుకుని ప్రమాణం చేయాలని అడుతున్నారు. దీంతో గ్రామస్థులు ఓడిపోయిన అభ్యర్థి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. VIDEO






