Congress: మాదిగలకు 18% రిజర్వేషన్స్ ఇవ్వండి.. పీసీసీ చీఫ్‍కు మాదిగ నేతల వినతి

by Prasad Jukanti |   (  Updated:2025-10-08 10:11:27  IST  )

స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిగలకు 18 శాతం సీట్లు కేటాయించాలని మాదిగ నేతలు కోరారు.

Congress: మాదిగలకు 18% రిజర్వేషన్స్ ఇవ్వండి.. పీసీసీ చీఫ్‍కు మాదిగ నేతల వినతి
X

దిశ, తెలంగాణబ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిగ సామాజికవర్గానికి 18 శాతం రిజర్వేషన్లు కల్పించాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‍, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‍కు మాదిగ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇవాళ మహేశ్ కుమార్ గౌడ్‍ను నివాసంలో మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఇతర నేతలు కలిశారు. ఈ సందర్భంగా మాదిగలకు 18 శాతం రిజర్వేషన్లు అమలు చేసి దానికి అనుగుణంగాణ సీట్లు కేటాయించాలని కోరారు.

Next Story