అమ్మాయిలు.. జాగ్రత్త! "దిశ కథనం"పై వీసీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్

by Ramesh Goud |   (  Updated:2025-02-07 12:32:00  IST  )

టీజీఎస్ఆర్టీసీ ఎండీ (TGSRTC MD) వీసీ సజ్జనార్ (VC Sajjanar) "దిశ దినపత్రిక" (Disha NewsPaper) లో వచ్చిన కథనం (Story)పై స్పందించారు.

అమ్మాయిలు.. జాగ్రత్త! దిశ కథనంపై వీసీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: టీజీఎస్ఆర్టీసీ ఎండీ (TGSRTC MD) వీసీ సజ్జనార్ (VC Sajjanar) "దిశ దినపత్రిక" (Disha News Paper) లో వచ్చిన కథనం (Story)పై స్పందించారు. అమ్మాయిలు (Girls).. సోషల్ మీడియా (Social Media) బూచోళ్లతో జాగ్రత్త! అని ఆసక్తికర ట్వీట్ చేశారు. సజ్జనార్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ (Active)గా ఉంటూ.. సైబర్ మోసాలు (Cyber Crimes), నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. కొత్తరకం సైబర్ మోసాల గురించి తెలియజేస్తూ.. ప్రజలను అలర్ట్ (Alert) చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఆసక్తికర ట్వీట్ (Tweet) చేశారు. ‘స్నేహం ముసుగులో.. సోషల్ మీడియాలో బూచాళ్లున్నారు జాగ్రత్త..!’ అని దిశ పత్రికలో వచ్చిన కథనాన్ని ట్విట్టర్ (Twitter) లో షేర్ చూస్తూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన.. అమ్మాయిలు.. సోషల్ మీడియా బూచోళ్లతో జాగ్రత్త! అని హెచ్చరించారు. అలాగే స్నేహం (Friendship), ప్రేమ (Love) ముసుగులో వారు నమ్మించి వంచిస్తున్నారని తెలిపారు. అంతేగాక సోషల్ మీడియా వేదికల్లో గుడ్డిగా అజ్ఞాత వ్యక్తుల (unknown people)ను ఫాలో కాకండి అని, ఫ్రెండ్ రిక్వెస్ట్ (Friends Requests)లను అంగీకరించకండి అని సూచనలు చేశారు. ఇక ముఖ్యంగా (especially) వ్యక్తిగత విషయాల (personal information)ను, ఫోటోలు (Photos), వీడియోలను (Videos) అసలే షేర్ (Share) చేయకండి అని తెలిపారు. స్నేహం, ప్రేమ ముసుగులో కామాంధులు (lustful), నేరస్థులు (criminals) ఉండొచ్చు.. బీ కేర్ ఫుల్ (Be careful)! అని సజ్జనార్ అమ్మాయిలకు ఎక్స్ ద్వారా అవగాహన కల్పించారు.

Next Story