Girls' Adventure : బడి కోసం బాలికల సాహసం...నిత్యం ప్రాణాలతో చెలగాటం

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-28 07:58:46  IST  )

దేశంలోని చాల గ్రామాల్లో విద్యార్థినులు చదువుకునేందుకు మైళ్ల దూరం నడవడం..కొండ మార్గాలు, నది మార్గాలు దాటి వెళ్లడం తరచు చూస్తుంటాం. అయితే ప్రాణాలకు తెగించి విద్య కోసం పాఠశాల(School)కు చేరుకోవడానికి నిత్యం తమ ప్రాణాలను పణంగా పెడుతు విద్యార్థిని(Girls Students)లు చేస్తు్న్న సాహసం వైరల్(Adventure)గా మారింది.

Girls Adventure :  బడి కోసం బాలికల సాహసం...నిత్యం ప్రాణాలతో చెలగాటం
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలోని చాల గ్రామాల్లో విద్యార్థినులు చదువుకునేందుకు మైళ్ల దూరం నడవడం..కొండ మార్గాలు, నది మార్గాలు దాటి వెళ్లడం తరచు చూస్తుంటాం. అయితే విద్య కోసం పాఠశాల(School)కు చేరుకోవడానికి నిత్యం తమ ప్రాణాలను పణంగా పెడుతు విద్యార్థిని(Girls Students)లు చేస్తు్న్న సాహసం వైరల్(Adventure)గా మారింది. ఉత్తరాఖండ్‌(Uttarakhand)లోని మున్సియరీ(Munsiyari)ప్రాంతం విద్యార్థినులు తమ పాఠశాలకు వెళ్లడానికి చేస్తున్న సాహసం విద్య కోసం వారు పడుతున్న పాట్లకు..అలాగే చదువుకోవాలన్న పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది.

వారు తమ పాఠశాలకు చేరుకోవడానికి స్థానికంగా కొండల మధ్య ప్రవహించే నదిని రోజు దాటాల్సి (Crossing the River) ఉంది. ఇందుకోసం వారికి నదిపై ఏర్పాటు చేసిన రికీటీ రోప్ ట్రాలీ మాత్రమే అందుబాటు ఉంది. కేబుల్స్ ద్వారా లింక్ చేయబడిన రోప్ ట్రాలీ వేగంగా ప్రవహించే నదిపై ప్రమాదకరంగా ఊగిసలాడుతుంది. అయితే ఆ బాలికలకు నది దాటడానికి మరో మార్గం లేదు. దీంతో తమకు ప్రమాదం ఎదురవుతుందన్న భయం కంటే చదువుకోవాలనే సంకల్పంతో నిత్యం సాహసోపేతంగా వారు నదిని దాటుతున్నారు.

సాహసోపేత క్రీడను తలపించేలా నదిని రోప్ వే ట్రాలీలో దాటేందుకు విద్యార్థినిలు నిత్యం పడుతున్న తిప్పలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు నదిని దాటే ప్రాణాంతక సాహసం ముందు చదువుకోవాలనుకున్న విద్యార్థినిల సంకల్పం గెలిచిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వాలు స్పందించి బాలిక విద్యపై వినిపించే నినాదాల పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకుని నదిపై వంతెనను నిర్మించాలని కోరుతున్నారు.

Next Story