- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
GHMC: బల్దియా ఆల్ టైం రికార్డ్.. రూ.2,012.36 కోట్ల ఆస్తి పన్ను వసూలు
బల్దియాకు ప్రధాన ఆదాయ వనరైన ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ ఆల్ టైం రికార్డు నమోదు చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: బల్దియాకు ప్రధాన ఆదాయ వనరైన ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ ఆల్ టైం రికార్డు నమోదు చేసింది. ఎన్నడూ లేనంతగా రూ.2వేల కోట్ల మార్క్ దాటింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను లక్ష్యం రూ.1970.10కోట్లుగా నిర్దేశించగా అదనంగా రూ.42.26కోట్లు వసూలు చేశారు. మరో రూ.50కోట్ల వరకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
19.49లక్షల ప్రాపర్టీలు
జీహెచ్ఎంసీ పరిధిలో 19.49 లక్షల ప్రాపర్టీలు ఉండగా వీటిలో రెసిడెన్సియల్ 16.35లక్షలు, నాన్ రెసిడెన్సియల్ 2.80లక్షలు, మిక్స్‌డ్ 34వేలు ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 16లక్షల మంది రూ.2012.365కోట్లు చెల్లించినట్టు సమాచారం. అత్యధికంగా శేరిలింగంపల్లి, చందానగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఆస్తి పన్ను వసూలవుతుందని అధికారులు చెబుతున్నారు. చార్మినార్ జోన్‌లోని ప్రాంతాల్లో అత్యల్పంగా వసూలవుతున్న విషయం తెలిసిందే.
నేటి నుంచి ఎర్లీబర్డ్
టార్గెట్‌ను మించి ఆస్తి పన్ను వసూలు చేసిన జీహెచ్ ఎంసీ మరో స్కీమ్ కు అవకాశం కల్పించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను నేటి నుంచి ఏప్రిల్ 30లోపు ఆస్తి పన్ను చెల్లిస్తే 5శాతం రాయితీ కల్పించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.
ఏసీ, జేసీలకు కమిషనర్ ప్రశంసలు
జీహెచ్ఎంసీ రికార్డు స్థాయిలో ఆస్తిపన్ను వసూలు చేసినందుకు గాను అదనపు కమిషనర్(రెవెన్యూ) అనురాగ్ జయంతి, జాయింట్ కమిషనర్ మహేశ్ కులకర్ణి బాగా కృషి చేశారని కమిషనర్ ఇలంబర్తి ప్రశంసించారు. వీరితో పాటు బిల్ కలెక్టర్లు, టాక్స్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు కష్టపడి పనిచేయడంతోనే టార్గెట్ కంటే ఎక్కువగా ఆస్తిపన్ను వసూలైందని కమిషనర్ తెలిపారు.






