ACB: ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ ఏఈ మనీషా.. రూ.15 వేలు లంచం తీసుకుంటూ..

by Ramesh Naini |

తెలంగాణ వ్యాప్తంగా వరుసగా ఏసీబీ అధికారులు రైడ్స్ చేస్తూ లంచగొండి అధికారులను అరెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

ACB: ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ ఏఈ మనీషా.. రూ.15 వేలు లంచం తీసుకుంటూ..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా వరుసగా ఏసీబీ (ACB) అధికారులు రైడ్స్ చేస్తూ లంచగొండి అధికారులను అరెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎంత మందిని అరెస్ట్ చేసిన కొంత మంది అధికారుల తీరు మాత్రం మారట్లేదు. ఇంకా టేబుల్ కింద చేయి చాపుతూనే ఉన్నారు. తాజాగా మరో అధికారిని లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది. రూ.15 వేలు లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ ఏఈ మనీషా (AE Manisha) ఏసీబీకి చిక్కింది.

అంబర్‌పేట జీహెచ్ఎంసీ కార్యాలయంలో బిల్లులు ఆమోదం చేసేందుకు ఇంజనీర్ ఏఈ మనీషా రూ.20,000 లంచం డిమాండ్ చేసింది. బాధితుడి ఫిర్యాదుతో (GHMC) జీహెచ్ఎంసీ కార్యాలయం పై ఏసీబీ రైడ్ చేసింది. ఇది వరకే రూ. 5 వేలు లంచం ఇచ్చాడు బాధిత కాంట్రాక్టర్. ఈ క్రమంలోనే ఏఈ మనీషా రూ.15,000 లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది.

Next Story