- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాయు నాణ్యతపై దృష్టి పెట్టండి: జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ రఘు ప్రసాద్
వాయు నాణ్యత ను మెరుగుపరిచేందుకు ప్రభుత్వ శాఖలు , విభాగాలు కలిసి కట్టుగా పనిచేయాలనీ జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ రఘు ప్రసాద్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: వాయు నాణ్యత ను మెరుగుపరిచేందుకు ప్రభుత్వ శాఖలు , విభాగాలు కలిసి కట్టుగా పనిచేయాలనీ జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ రఘు ప్రసాద్ అన్నారు. గురువారం జాతీయ స్వచ్ఛ గాలి కార్యక్రమం(ఎన్సీఏపీ) అమలును వేగవంతం చేయడానికి భాగంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సిటీ లెవల్ మానిటరింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ (సీఎల్ఎంఐసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ రఘు ప్రసాద్ నగరంలో గాలి కాలుష్య నియంత్రణకు సంబంధించిన విభాగాల పనితీరును సమీక్షించారు.
సమావేశంలో హాట్‌స్పాట్‌ల వారీగా వాయు నాణ్యత పరిస్థితులు, ప్రస్తుత అమలు స్థితి, రోడ్డు ధూళి నియంత్రణ, వాహన కాలుష్యం తగ్గింపు, పరిశ్రమలు సీ అండ్ డీ వేస్ట్ కార్యకలాపాలపై పర్యవేక్షణ వంటి అంశాలను విశ్లేషించారు. నగరంలో కాలుష్యాన్ని కనీస స్థాయికి తగ్గించి వాయు నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని అధికారులకు అదనపు కమిషనర్ సూచించారు. సమావేశంలో సాలీడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ విభాగం సెంట్రల్ పోల్యూషన్ కంట్రోల్ బోర్డ్ టెక్నికల్ కన్సల్టెంట్ సుధాకర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






