Ghanta Chakrapani: ఆ ఇద్దరిదీ ఒకే కథ.. అద్దంకి, దాసోజుకు ఎమ్మెల్సీ ఇవ్వడంపై ఘంటా చక్రపాణి కామెంట్

by Prasad Jukanti |

అద్దంకి, దాసోజుకు ఎమ్మెల్సీ ఇవ్వడంపై ఘంటా చక్రపాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Ghanta Chakrapani: ఆ ఇద్దరిదీ ఒకే కథ.. అద్దంకి, దాసోజుకు ఎమ్మెల్సీ ఇవ్వడంపై ఘంటా చక్రపాణి కామెంట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ (MLC Election) అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్‌కు (Addanki Dayakar), బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్‌కు (Dasoju Shravan) అవకాశం దక్కడంపై డా.బీఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి (Ghanta Chakrapani) స్పందించారు. ‘నా ఇద్దరు మిత్రులు, ఒక రకంగా ఆత్మీయ సోదరులు అద్దంకి దయాకర్, దాసోజు శ్రావణ్. ఆయా పార్టీల నుంచి శాసన మండలికి ఎంపికయ్యారు. ఇద్దరికీ అభినందనలు. శుభాకాంక్షలు. శ్రావణ్ అటు ఇటుగా ఉస్మానియాలో ఒకే బ్యాచ్. ఆయన రైట్ వింగ్ లీడర్, మేం లెఫ్ట్. అయినా మేమిద్దరం మంచి మిత్రులం. ఇక దయాకర్ తెలంగాణ ఉద్యమంతో పరిచయం. నాకు ప్రత్యేక అభిమానం. ఇద్దరిదీ ఒకే కథ. విద్యాధికులు, బోల్డ్, డైనమిక్. సామాజిక స్పృహ ఉన్నవాళ్లు. అయినా అవకాశాలు రాని నాయకులు. మంచి వాగ్ధాటి, విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్లు. ఈ ఇద్దరినీ ఎంపిక చేసినందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకత్వాలకు కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేశారు. సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ ట్విట్టర్ హ్యాండిల్స్‌ను ట్యాగ్ చేశారు.

Next Story