అలాంటి వారికే అడ్మినిస్ట్రేటివ్ పదవులు ఇవ్వండి.. జార్జిరెడ్డి పీడీఎస్‌యూ డిమాండ్

by Ajay Maddhiboyina |

ఈనెల 7వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో జార్జిరెడ్డి పీడీఎస్‌యూ సీఎం రేవంత్ రెడ్డి ముందు పలు డిమాండ్లు చేస్తోంది.

అలాంటి వారికే అడ్మినిస్ట్రేటివ్ పదవులు ఇవ్వండి.. జార్జిరెడ్డి పీడీఎస్‌యూ డిమాండ్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఈనెల 7వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో జార్జిరెడ్డి పీడీఎస్‌యూ సీఎం రేవంత్ రెడ్డి ముందు పలు డిమాండ్లు చేస్తోంది. పదవుల కోసం, రాజకీయ పలుకుబడి కోసం వెంపర్లాడే వారి కోసం కాకుండా ఓయూ అభివృద్ధి, విద్యార్థుల కేంద్రంగా ఉండేవారికి అడ్మినిస్ట్రేటివ్ ప‌ద‌వులు ఇవ్వాల‌ని పేర్కొంది. అడ్మినిస్ట్రేషన్ విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేసేలా ఉండాలని, ఓయూ స్టూడెంట్ ఎజెండాను అమలు చేయాలని తెలిపింది.

స్టూడెంట్ ఎజెండా లోని అంశాలు:

1.ఓయూ విద్యార్థులకు ఉచిత మెస్ వసతి కల్పించాలి. మెస్ డిపాజిట్లు పద్దతి రద్దు చేయాలి.

2. ఓయు విద్యార్థులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి.

3. రీసెర్చ్ స్కాలర్స్ కు, స్టూడెంట్స్ కు ఫెలో షిప్ ఇవ్వాలి

4.ఓయూ విద్యార్థుల స్కాలర్షిప్ పెంచాలి

5.యూనివర్సిటీలో కోర్సు ఫీజులు, ఎగ్జామినేషన్ ఫీజులు తగ్గించాలి.

6.టీచింగ్ ,నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలి

7.ఓయూ అభివృద్ధికి రూ.1000 కోట్ల నిధులు విడుదల చేయాలి.

8.విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలి.

9. మౌళిక వసతులు మెరుగు పరచాలి.

Next Story