- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గీతం యూనివర్సిటీ రూ.118 కోట్ల విద్యుత్ బకాయిలు.. మండిపడిన హైకోర్టు
తెలంగాణలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీపై, విద్యుత్ శాఖపై హైకోర్టు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీపై, విద్యుత్ శాఖపై హైకోర్టు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది. సామాన్యులు వెయ్యి రూపాయలు బకాయిలు ఉంటేనే ముక్కు పిండి వసూలు చేసే విద్యుత్ శాఖ అధికారులు.. గీతం యూనివర్సిటీ వంద కోట్ల బకాయిలు ఉంటే ఎలా చూసి చూడకుండా ఉన్నారని మండిపడింది. అయితే హైదరాబాద్‌లోని గీతం యూనివర్సిటీకి విద్యుత్ బిల్లులు చెల్లించలేదని SPDCL నోటీసులు జారీ చేసింది. 2008 నుంచి ఇప్పటివరకు సుమారు రూ.118 కోట్ల కరెంట్ బిల్లు చెల్లించలేదని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ నోటీసులను సవాల్ చేస్తూ గీతం యూనివర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారాన్ని విచారించిన జస్టిస్ నగేష్ భీమపాక తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు వెయ్యి రూపాయలు బిల్లు కట్టకపోతేనే విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తున్నారని, అలాంటప్పుడు గీతం యూనివర్సిటీకి ప్రత్యేక వెసులుబాటు ఎందుకని ప్రశ్నించారు. ఈ అంశంపై పూర్తి వివరాలు ఇవ్వాలని, సూపరింటెండెంట్ ఇంజినీర్ వ్యక్తిగతంగా హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.






