- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Economic Survey: 6.3- 6.8 శాతం వృద్ధిరేటుకు చాన్స్..ఆర్థిక సర్వేలో కీలక అంశాలు
ఆర్థిక సర్వేలో ను పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు.

దిశ, డైనమిక్ బ్యూరో : ధరల పెరుగుదల కారణంగా ప్రజలు కొనుగోళ్లను తగ్గించారని, అయితే ప్రభుత్వ మూలధన వ్యయ వృద్ధితో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక సర్వే (Economic Survey) పేర్కొన్నది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ జీడీపీ 6.3 నుంచి 6.8 శాతంగా ఉండవచ్చని సర్వే అంచనా వేసింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2024-25 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ పరిణమాలతో ఆర్థిక పరమైన సవాళ్లు ఎదురవుతున్నా అయినా కూడా దేశీయ ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా ఉందని సర్వే పేర్కొన్నది. రబీ పంట దిగుబడి బాగుంటే 2026 తొలి అర్ధభాగంలో ఆహార పదార్థాల ధరలు తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఇప్పటికే కరీఫ్ పంట రావడంతో ఆహార పదార్థాల ధరలు తగ్గాయని, దీంతో 2024-25 నాలుగో త్రైమాసికంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గొచ్చని అంచనా వేసింది. పదేళ్లపాటు 8 శాతం జీడీపీ (GDP) వృద్ధిరేటు ఉండాలని అప్పుడే 2047 కల్లా వికసిత్ భారత్ సాధ్యపడుతుందని సర్వే తెలిపింది. తయారీ రంగం నెమ్మదించడం, కార్పొరేట్ పెట్టుబడులు తగ్గడంతో 2024-25లో భారత వృద్ధి రేటు 6.4 శాతానికి పరిమితం కావొచ్చని, గత నాలుగేళ్లలో ఇదే అత్యల్పం అని తెలిపింది. 2023-24 వృద్ధి రేటు 8.2 శాతంగా ఉండగా 2022-2023లో 7.2 శాతం, 2021-22 లో 8.7 శాతంగా ఉందని తెలిపింది.ద్రవ్యోల్బనం అదుపులోనే ఉంటుందని పేర్కొంది.
1960 నుంచి ఆనవాయితీగా..
కాగా గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరు, రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్‌లోని ఎకనమిక్ డివిజన్ ఈ ఆర్థిక సర్వేను రూపొందిస్తుంది. కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు రోజు ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెట్టడం 1960 నుంచి ఆనవాయితీగా వస్తోంది. అంతకు ముందు 1950-51 సంవత్సరం నుంచి ఆర్థిక సర్వేను బడ్జెట్‌తో పాటే ప్రవేశపెట్టారు. రేపు కేంద్ర పద్దును నిర్మలా సీతారామన్ సభకు సమర్పించనున్నారు.






