అక్కడ కూడా నాదే పై చేయి.. యూట్యూబర్ అన్వేష్ కామెంట్స్‌పై గరికపాటి ఫైర్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-02 11:27:02  IST  )

అన్వేష్ చేసిన వ్యాఖ్యలపై గరికపాటి పరోక్షంగా స్పందించారు. నేరస్థుడికి పది సంవత్సరాలు శిక్ష వేసినా మారుతాడో లేదో కానీ సమాజం ఛీ కొడితే మాత్రం మార్పు వస్తుందని అన్నారు.

అక్కడ కూడా నాదే పై చేయి.. యూట్యూబర్ అన్వేష్ కామెంట్స్‌పై గరికపాటి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: మహిళల వస్త్రాదరణపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన కామెంట్స్ ను యూట్యూబర్ నా అన్వేషణ ఖండించిన సంగతి తెలిసిందే. గరికపాటిని బూతులు తిడుతూ అన్వేష్ మహిళలు తమకు నచ్చినట్టు దుస్తులు వేసుకోవచ్చని చెప్పాడు. అయితే అన్వేష్ చేసిన వ్యాఖ్యలపై గరికపాటి పరోక్షంగా స్పందించారు. నేరస్థుడికి పది సంవత్సరాలు శిక్ష వేసినా మారుతాడో లేదో కానీ సమాజం ఛీ కొడితే మాత్రం మార్పు వస్తుందని అన్నారు. అలా చేస్తే పదిరోజుల్లోనే మరుతాడని అన్నారు. ఎలాంటి మచ్చలేని వాళ్లపై ఇక్కడ బురద చల్లుతున్నారని మండిపడ్డారు.

వ్యక్తిత్వాన్ని కూనీ చేసేలా మాట్లాడుతున్నారని అన్నారు. సహిస్తూ ఉంటే రెచ్చిపోతున్నారని అన్నారు. కానీ తన తనపై కామెంట్స్ చేస్తే అభిమానులు మాత్రం సహించలేదన్నారు. శత్రులకు గట్టిగా బుద్ధి చెబుతున్నారని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా కామెంట్లలోనూ తమదే పైచేయి అని చెప్పారు. ఇదిలా ఉంటే గరికపాటిపై అన్వేష్ బూతులు మాట్లాడటంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఆయనను అన్ ఫాలో చేస్తున్నారు. గరికపాటి మంచి విషయాలు చెబుతాడని అలాంటి వ్యక్తిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏంటి అని ఫైర్ అవుతున్నారు.

Next Story