- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గప్పా..గప్పా గుద్ది రప్పా.. రప్పా జైల్లో వేయాలి.. బీఆర్ఎస్ నేతలపై ఎంపీ అర్వింద్ ఫైర్
పుష్ప-2 సినిమాలోని రప్పా.. రప్పా డైలాగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్‌గా హీట్‌ను పుట్టిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: పుష్ప-2 సినిమాలోని రప్పా.. రప్పా డైలాగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్‌గా హీట్‌ను పుట్టిస్తోంది. తాజాగా, మాజీ మంత్రి హరీష్ రావు తలపెట్టిన రైతు మహా ధర్నాలో రప్పా.. రప్పా.. ప్లకార్డులు, బీఆర్ఎస్ 3.0 లోడింగ్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. అయితే, ఇదే టాపిక్‌పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి.. అన్ని వ్యవస్థలను భృష్టు పట్టించిన బీఆర్ఎస్‌కు మళ్లీ 3.0 ఏంటని మండిపడ్డారు. వాళ్ల మొహాలకు మూడు సీట్లు వస్తే గొప్ప అంటూ ఫైర్ అయ్యారు.
రాబోయే సాధారణ ఎన్నికల్లో సిద్దిపేట జిల్లాలో ఒక్క హరీశ్ రావు తప్ప.. మరెవరూ గెలిచే పరిస్థితి లేదన్నారు. ఆయనకు కూడా ఆ ఒక్క నియోజవర్గంలో ఆదరణ ఉందే తప్పా.. మరెక్కడ లొట్టపీసు ఏం లేదంటూ సెటైర్లు వేశారు. ఆఖరికి అయ్యా, కొడుకులు ఇద్దరు ఓడిపోవడం ఖాయమని కేటీఆర్ (KTR), కేసీఆర్ (KCR)ను ఉద్దేశించి కామెంట్ చేశారు. చెల్లెలు కవిత (Kavitha) రాజకీయ జీవితాన్ని ముగించాలని ప్రయత్నిస్తున్న కేటీఆర్‌కు కూడా అదే గతి పట్టబోతోందని తెలిపారు. కాళేశ్వరం (Kaleshwaram) స్కామ్‌లో కేసీఆర్‌ను, లిక్కర్ స్కామ్‌లో కవితను, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌ను గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైలులో వేయాలని.. అలా చేస్తే మరిన్ని స్కామ్‌లు వెలుగులోకి వస్తాయని అన్నారు. అవినీతి కేసుల్లో బీఆర్‌ఎస్ నేతలను జైలులో పెట్టకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం భూస్థాపితం అవుతుందని ధర్మపురి అర్వింద్ జోస్యం చెప్పారు.






