మిర్చి బజ్జీతో రేవంత్ కడుపు నింపిన గంగవ్వ.. కన్నతల్లి గుర్తుకు వచ్చిందంటూ TPCC చీఫ్ ఎమోషనల్

by Disha Web Desk 19 |
మిర్చి బజ్జీతో రేవంత్ కడుపు నింపిన గంగవ్వ.. కన్నతల్లి గుర్తుకు వచ్చిందంటూ TPCC చీఫ్ ఎమోషనల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్రలో బిగ్‌బాస్ ఫేమ్ గంగవ్వ ప్రత్యక్షమైంది. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీ- కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని బిగ్‌బాస్ ఫేమ్ గంగవ్వ కలిసింది. రేవంత్‌రెడ్డి కోసం ప్రేమతో మిర్చి బజ్జీ తీసుకురాగా, ఆయన ఎంతో ఇష్టంగా ఆరగించారు. ఈ విషయాన్ని రేవంత్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

‘గంగవ్వ! తెలంగాణకు పరిచయం అక్కరలేని అవ్వ. ప్రపంచానికి తనొక సెలబ్రిటీ. నాకు మాత్రం ప్రేమను పంచిన అమ్మ. నా కోసం ఆప్యాయంగా నాకిష్టమైన మిర్చీ బజ్జీ తెచ్చి, తను చూపించిన ప్రేమ నా కన్నతల్లిని గుర్తుకు తెచ్చింది. యాత్రలో జనం కష్టాలు, బాధలు నేరుగా చూస్తున్నా, నా అనుభవాలను నా తల్లితో ఇలాగే ముచ్చటించే వాడిని. తల్లిని గుర్తు చేసిన గంగవ్వను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను’ అంటూ ఆయన ఎమోషనల్ ట్వీట్ చేశారు.

Next Story