Saroornagar : జనసంద్రంగా మారిన సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్

by Muthe.Rajitha |   (  Updated:2024-09-17 13:31:44  IST  )

సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన(Ganesh immerson) కార్యక్రమం తిలకించడానికి తండోపతండాలుగా ప్రజలు తరలివచ్చి నిమజ్జన కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు.

Saroornagar : జనసంద్రంగా మారిన సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్
X

దిశ ఎల్బీనగర్ : సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన(Ganesh immerson) కార్యక్రమం తిలకించడానికి తండోపతండాలుగా ప్రజలు తరలివచ్చి నిమజ్జన కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు.సరూర్ నగర్ ట్యాంక్ బండ్ వద్ద ఏడు పెద్ద క్రేన్లను అధికారులు ఏర్పాటు చేశారు. సాయంత్రం వరకు తక్కువ సంఖ్యలోనే నిమజ్జనాలు జరిగిన... అధిక సంఖ్యలో రాత్రి 7 గంటల నుండి రావచ్చని అంచనా వేస్తున్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా మినీ ట్యాంక్ బండ్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆధ్వర్యంలో... ఎల్బీనగర్ డిసిపి ప్రవీణ్ కుమార్, ఎల్బీనగర్ ట్రాఫిక్ డిసిపి శ్రీనివాసులు ఎల్బీనగర్ ఏసిపి కృష్ణయ్య, ఎల్బీనగర్ సరూర్నగర్ మీర్పేట్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి వస్తున్నటువంటి గణనాధులను క్రమ పద్ధతిలో నిమజ్జనం చేస్తున్నారు.

Next Story