Game Changer: మెగా ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ప్రైవేటు బస్సుల్లో ‘గేమ్ ఛేంజర్’ మూవీ

by Kema Shiva Kumar |

భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సంక్రాంతి (Sankranthi) పండుగ నేపథ్యంలో డివైడ్ టాక్ దూసెకెళ్తోంది.

Game Changer: మెగా ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ప్రైవేటు బస్సుల్లో ‘గేమ్ ఛేంజర్’ మూవీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సంక్రాంతి (Sankranthi) పండుగ నేపథ్యంలో డివైడ్ టాక్ దూసెకెళ్తోంది. ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ (Mega Fans), చిత్ర నిర్మాతలకు బిగ్ షాక్ తగిలింది. విడుదలైన తొలిరోజే మూవీ హెచ్‌డీ ప్రింట్ (HD Print) బయటకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా.. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీని ప్రైవేటు బస్సుల యాజమానులు తమ బస్సుల్లో విచ్చలవిడిగా ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ప్రయాణికుల నుంచి డబుల్ చార్జీలు వసూలు చేస్తూ వారికి ఎంటర్‌టైన్‌మెంట్ రూపంలో గేమ్ ఛేంజర్ (Game Changer) మూవీని షో చేస్తున్నారు. ఈ క్రమంలోనే బస్సులో ప్రయాణిస్తున్న ఓ నెటిజన్ ఆ తతంగాన్ని అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ ఆ వీడియో కాస్త విపరీతంగా వైరల్ అవుతోంది.

కాగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రధాన పాత్రలో నటించిన గేమ్ ఛేంజర్(Game Changer Movie) చిత్రానికి విడుదల రోజే భారీ షాక్ తగిలింది. రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమా విడుదలైన వెంటనే హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లోకి వచ్చేసింది. ఈ పరిణామంతో చిత్ర యూనిట్‌తో పాటు మెగా అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూవీకి శంకర్ దర్శకత్వం వహించగా.. రామ్ చరణ్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా.. అంజలి, శ్రీకాంత్(Srikanth), సునీల్, ఎస్‌జే సూర్య, జయరామ్, తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Next Story